రాజవొమ్మంగి రైతులకు గమనిక..!
ASR: దళారులకు ధాన్యాన్ని అమ్మి తూకం, ధరలో మోసపోవద్దని ఏవో చక్రధర్ సూచించారు. రాజవొమ్మంగి మండలంలో ఆరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన 24 గంటల్లో సొమ్ములు రైతులు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. శరభవరం, దూసరపాము, రాజవొమ్మంగి, జడ్డంగి, లబ్బర్తి, కొమరాపురం రైతు సేవ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.