ఎల్పీజీ సంక్షోభంపై లోక్‌సభలో చర్చ

ఎల్పీజీ సంక్షోభంపై లోక్‌సభలో చర్చ

ఎల్పీజీ సంక్షోభంపై ఇవాళ సాయంత్రం 4:30కి లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడనున్నారు. రాహుల్ ప్రశ్నలకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమాధానం ఇవ్వనున్నారు. గత కొన్నాళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరల్లో వచ్చిన మార్పులు, సబ్సిడీ తగ్గింపుపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ఉజ్వల యోజన పథకంపై ప్రశ్నించే అవకాశం ఉంది.