పోస్టల్ బ్యాలెట్‌కు ఉద్యోగులు వెనుకడుగు
BHNG: పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. తమ గ్రామాల్లో కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉన్న చోట, పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఓట్ల లెక్కింపు సమయంలో వారు ఎవరికి ఓటు వేశారనే విషయం బహిర్గతం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల్లో ఓటు ఎవరికి వేశామో తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో ఉన్నారు.