పోలీస్ వాహనంపై మృతదేహంతో నిరసన
TG: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోమచంద గ్రామంలో విషాదం జరిగింది. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్రీకాంత్ రెడ్డి మృతదేహంతో కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి.. ఆందోళన చేశారు.