VIDEO: ఆర్టీసీ సమ్మెకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం
SRD: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయిందన్నారు. గత రెండున్నర ఏళ్ల నుంచి ఓపిక పట్టిన ఉద్యోగులు, ఇప్పుడు సమ్మెకు దిగారని చెప్పారు.