పంట నష్టం లెక్కింపు పారదర్శకంగా జరుగుతుంది: కలెక్టర్
కృష్ణా: జిల్లాలో పంట నష్టం లెక్కింపు ప్రక్రియపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైవని కలెక్టర్ అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేవి కావని జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పంటనష్టం లెక్కింపు కార్యక్రమం గత ఏడు రోజులుగా అధికారుల సమక్షంలో నిరంతరంగా, పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు.