మంటల్లో పడి రైతు సజీవ దహనం
MHBD: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొత్తగూడ మండలం గోపాలపురం వద్ద రైతు మొక్కజొన్న చొప్పకు అంటుకున్న మంటల్లో పడి సజీవదహనం అయ్యాడు. రైతు ఉదయం నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా.. మంటల్లో చిక్కుకొని ఉన్నాడు. కాగా, మృతుడు రైతు చిన్న సమ్మయ్య గా గుర్తించారు.