మైదుకూరులో వినాయకుడి విగ్రహం ఏర్పాటు

మైదుకూరులో వినాయకుడి విగ్రహం ఏర్పాటు

KDP: మైదుకూరు పట్టణంలోని వినాయక నగర్‌లో తాగునీటి మోటారు పక్కన వినాయకుని విగ్రహం వెలసింది. గురువారం వినాయకుడికి పట్టణ ప్రాంత ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ మహారాజ్‌కి జై అంటూ నినాదాలు చేస్తూ భజనలు, పూజలు చేశారు. ఈ ప్రత్యేక పూజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.