లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెలిమినేడు దగ్గర బియ్యం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకి అడ్డంగా లారీ ఉండడంతో జాతీయ రహదారి-65పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్  చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.