వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
కృష్ణా: కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులో కలెక్టర్ డీకే బాలాజీ సమావేశం నిర్వహించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, డిమాండ్‌కు తగట్టుగా నిల్వలు సిద్ధం చేయాలన్నారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడలన్నారు.