CAT, CET పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
KRNL: ఈ నెల 24న జరగనున్న CAT, CET ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఇవాళ ఆదేశించారు. CAT పరీక్ష ఉదయం 10-12 గంటల వరకు 27 కేంద్రాల్లో 6310 మంది, CET మధ్యాహ్నం 2:30 -5 గంటల వరకు 35 కేంద్రాల్లో 7613 మంది హాజరుకానున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు వైద్య సదుపాయాలు, తాగునీరు, రవాణా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.