రోడ్డు ప్రమాదం కుటుంబాలకు సీఎం ఎక్స్‌గ్రేషియా

రోడ్డు ప్రమాదం కుటుంబాలకు సీఎం ఎక్స్‌గ్రేషియా

ప్రకాశం: మర్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై కేబినేట్ భేటిలో చర్చ జరిగింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు చొప్పన ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారికి కేబినెట్ సంతాపం తెలిపింది.