విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం
RR: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొనడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఈ విమానం ల్యాండింగ్ సమయంలో పక్షిని ఢీకొట్టింది. విషయాన్ని గమనించిన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.