మరికొన్ని గంటల్లో నరసాపురానికి వందేభారత్‌

మరికొన్ని గంటల్లో నరసాపురానికి వందేభారత్‌

W.G: చెన్నైసెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్‌ (20677/20678) సోమవారం నరసాపురం రైల్వేస్టేషన్‌‌లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ చొరవతో ఒకనెల ముందుగానే జిల్లాకు వస్తోంది. ఈ మేరకు స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అతిథులకు ఆహ్వానం అందించారు.