దిబ్బపాలెంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం

VSP: దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆశా కార్యకర్త కన్నయ్యమ్మ అన్నారు. రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలోని దిబ్బపాలెంలో శుక్రవారం ఉదయం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల పరిసరాల్లో నీరు నిలువ ఉన్న చోట మురుగును తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.