RO-KO సొంతం కానున్న సచిన్-ద్రవిడ్ రికార్డ్
భారత క్రికెట్‌కు సుదీర్ఘకాలంగా తమ సేవలు అందిస్తున్న రోహిత్, కోహ్లీ ఇప్పటివరకు కలిసి 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. ఇవాళ సౌతాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే ఈ జోడీకి 392వ మ్యాచ్ కానుంది. దీంతో RO-KO అత్యధిక మ్యాచుల్లో కలిసి ఆడిన భారత జోడీగా రికార్డ్ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం సచిన్-ద్రవిడ్(391)తో సమంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.