VIDEO: యూరియా కోసం రైతుల ధర్నా
NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని యూరియా కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా సరఫరాలో ఓటీపీ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ రేణుక నాగరాజు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే పెద్దఎత్నున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.