అల్కరాస్‌కు మెద్వెదెవ్ షాక్
ఇండియన్ వెల్స్ ఏటీపీ-1000 సెమీఫైనల్లో మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాస్‌ను 6–3, 7–6 (7/3)తో ఓడించి, మూడోసారి ఈ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఏడాది అల్కరాస్‌కు ఇదే తొలి పరాజయం. గత రెండు ఫైనల్స్‌లో అల్కరాస్ చేతిలో ఓడిన మెద్వెదెవ్, ఈసారి టైటిల్ పోరులో యానిక్ సినెర్‌తో తలపడనున్నాడు.