బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలి

WGL: దేశంలోని బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట ఆర్‌డీఓ కార్యాలయంలో బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణలోని శ్రావణపల్లి, తాడిచెర్ల, సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు గనుల బ్లాకులను వేలం పాట ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. అశోక్, కుమార్ తదితరులున్నారు.