చిట్యాలలో బీజేపీ నాయకుల అరెస్టు

NLG: హిందూ సంఘాలు, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ పిలుపుమేరకు చలో పెద్దమ్మతల్లి కార్యక్రమానికి వెళ్లకుండా స్థానిక బీజేపీ నాయకులను చిట్యాల పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, జిల్లా నాయకులు చికిలమెట్ల అశోక్, పాల రవి వర్మ, బెల్లి నరేష్ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.