హైకోర్టులో తోపుదుర్తి ముందస్తు బెయిల్ పిటిషన్

AP: హైకోర్టులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. అనంతపురం జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో తోపుదుర్తిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.