రేపు ఆమనగల్లులో ఉచిత కంటి వైద్య శిబిరం

RR: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ పీఆర్ రావు పాషా తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిబిరానికి వచ్చే వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.