VIDEO: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వాహనం
ASR: గూడెం కొత్తవీధి మండలం వింతడా టేకుల వీధి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు యువకుల కాళ్లు విరిగాయని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.