ఫ్లాట్స్ పేరుతో మోసం.. ఎస్పీకి ఫిర్యాదు
NDL: నంద్యాలకు చెందిన భవనాసి సత్యం 60 నెలలు డబ్బులు కడితే ఇస్తానని నమ్మించి మోసం చేశాడని శిరివెళ్ల మండలం పచ్చర్ల గూడెంకు చెందిన జమ్మన్న సోమవారం ప్రజా పరిష్కార వేదికలో ఎస్పీ సునీల్ షరాన్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం డబ్బులు కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీని వేడుకున్నట్లు పేర్కొన్నాడు.