ఎస్పీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి అంబటి నిరసన

ఎస్పీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి అంబటి నిరసన

GNTR: జిల్లా ఎస్పీ కార్యాలయం బయట సోమవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. కొంతకాలంగా తాము ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా, కేసులు నమోదు చేయకుండా పక్కన పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.