జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలు

జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలు

అన్నమయ్య: రాయచోటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని దేశభక్తి సందేశంతో నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.ఎం. మునియా నాయక్ ఆధ్వర్యంలో NCC యూనిట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 35 మంది కేడెట్లు పాల్గొని సైనికుల త్యాగాలను స్మరించారు. అనంతరం పట్టణంలో పతాక దినోత్సవ నిధి సేకరణ చేపట్టి సైనిక కుటుంబాల సంక్షేమంపై ప్రజల్లో అవగాహన కల్పించారు.