సిరిసిల్లలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం
SRCL: పట్టణంలోని 33వ వార్డులో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలర్ కొండ వర్షిణి - నరేష్ ఇవాళ నిర్వహించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలం చెందిందన్నారు. నూతన పెన్షన్‌లు, మహిళలకు రూ. 2500, తులం బంగారం వంటీ ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.