VIDEO: యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: రైతులు

BHPL: గణపురం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే ఎరువుల విక్రయ కేంద్రం ముందు భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. రోజులు మారుతున్నా క్యూలైన్లో నిలబడే తీరు మారడం లేదని రైతులు వాపోతున్నారు. పంటల ఎదుగుదలకు అవసరమైన ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.