మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్

మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్

KDP: మదనపల్లె జిల్లా సాధన ఉద్యమకారులు అత్యవసర సమావేశం ఇవాళ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మదనపల్లె జిల్లా హామీ నెరవేరకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటి వరకు మదనపల్లెకు రాకపోవడం, అభిప్రాయాలు సేకరించకపోవడం పట్ల అసంతృప్తి చెందారు. తాజా జిల్లాల ప్రతిపాదనల్లో మదనపల్లె ప్రస్తావన లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.