ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
HNK: భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై ముల్కనూర్ వెళ్తుండగా.. హుస్నాబాద్ నుంచి వస్తున్న ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.