VIDEO: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనలో కోలాట నృత్యాలు

VIDEO: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనలో కోలాట నృత్యాలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో స్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా మహిళలు భక్తి పాటలకు కోలాట నృత్యాలతో అదరగొట్టారు. ఉత్సాహంతో మహిళలు చేస్తున్న నృత్యాలు ఉత్సవాలకు హాజరైన భక్తులను ఎంతగానో అలరించాయి.