వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తాతయ్య

NTR: జగ్గయ్యపేట పట్టణంలో వర్ష ప్రభావిత ప్రాంతాలైన వైవై కాలనీ, ఆర్టీసీ కాలనీ, దుర్గాపురం, చెరువు అలుగు, రైల్వే ట్రాక్ వద్ద రోడ్డు కోతకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే తాతయ్య పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే తగిన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.