VIDEO: సాయినాథుని ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే
NZB: ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయినాథుని ఆలయంలో గురువారం సాయి ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ పూజారి విజయ్ కుమార్ హారతులు ఇచ్చారు. ఆయనతో పాటు లింగంపేట్ అయ్యప్ప ఆలయ ధర్మకర్త రవిగౌడ్, లింగంపేట్ మండల అయ్యప్ప స్వాములు సాయి దర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణలో అన్నప్రసాద కార్యక్రమం జరిగింది.