నెతాన్యాహును చంపుతానన్న 2 గంటల్లోనే హతం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును వేటాడి చంపుతామని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ టాప్ కమాండర్ మొహమ్మద్ కరామీ హతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆయన మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. హెచ్చరిక జారీ చేసిన కేవలం 2 గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం సంచలనం రేపుతోంది. దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.