'వరి పంటలు వేసుకుంటాం.. అనుమతివ్వండి'

'వరి పంటలు వేసుకుంటాం.. అనుమతివ్వండి'

MDK: వచ్చే వేసవికాలం వరి పంటలు వేసుకోవడానికి అనుమతివ్వాలని టేక్మాల్ గ్రామ రైతులు మండల తహాశీల్దార్ తులసిరామ్‌ను గురువారం కలిశారు. వర్షాకాలంలో పొలాల్లో వేసిన వరి పంటలు భారీ వర్షాలకు, వరదలకు కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చెరువులు నీళ్లతో నిండు కుండల ఉన్నాయని రైతులకు వరి పంటలు వేసుకోవడానికి అనుమతినివ్వాలని కోరారు.