అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరుకు శంకుస్థాపన
RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరు పనులకు శుక్రవారం ఆలయ కమిటీ ఛైర్మన్ బెజవాడ అనిత రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నామని తెలిపారు. రూ.15 లక్షలతో పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.