అపరిశుభ్రంగా పంచాయతీ వీధులు

నల్గొండ: మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయింది. గ్రామకార్యదర్శి ఎంత చెప్పినా వినకపోవడంతో మురికి నీరు రోడ్లపై చేరుట వలన దోమలు ఈగలు విపరీతంగా చేరి ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారని స్థానికులు తెలిపారు. తక్షణమే గ్రామకార్యదర్శి స్పందించి డ్రైనేజీ కాల్వలోని చెత్తాచెదారం తొలగించి దోమల బారి నుండి కాపాడాలని కోరారు.