BREAKING: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
TG: రాష్ట్రంలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్లలో నిలబడ్డ వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విడతలో మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై.. మ. ఒంటి గంటకు ముగిసింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఇవాళే జరగనుంది.