'బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు'

'బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు'

MBNR: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐ అప్పయ్య హెచ్చరించారు. బెట్టింగ్‌ల వల్ల యువత జీవితాలు నాశనమవుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్రమ బెట్టింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.