న్యూ ఇయర్‌కు 'నువ్వు నాకు నచ్చావ్'
విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్ కాబోతోంది. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న ఈ చిత్రాన్ని 4K క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.