VIDEO: గోవుర్లో హోరాహోరీగా కుస్తీ పోటీలు
NZB: డోకేశ్వరం మండలంలోని గోవుర్ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్థానిక నాయకులు, భక్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో పలు గ్రామాల నుంచి పహిల్వాన్లు పాల్గొని తమ సత్తా చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కుస్తీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.