అధిక ధరలకు మద్యం అమ్మకాలు.. వీడియో వైరల్

అధిక ధరలకు మద్యం అమ్మకాలు.. వీడియో వైరల్

కోనసీమ: అంబాజీపేట మండలంలో మద్యం దుకాణాలలో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. స్థానిక వీరభద్ర థియేటర్ వద్ద ఉన్న మద్యం షాప్‌లో అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా లూజు మద్యం అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.