'9 ఫిర్యాదులు స్వీకరణ'

W.G: పాలకోడేరు జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు స్వీకరించినట్లు ఎస్పీ అద్నాను నయూం అస్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.