కన్నతల్లి పేగు బంధమే గెలిచింది

కన్నతల్లి పేగు బంధమే గెలిచింది

పేదరికం మూడేళ్ల కన్నబిడ్డను తల్లికి దూరం చేస్తే.. పేగుబంధం ఆ తల్లి బిడ్డలను మళ్లీ ఒకటి చేసింది. నెల్లూరు జిల్లా గుడ్లూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిరుపేదలైన దంపతులు తమ ముగ్గురు చిన్నారుల ఆలనా పాలన చూడలేక 2 నెలల క్రితం తమ మూడేళ్ల చిన్నారిని రూ. లక్షకి అమ్మేశారు. కానీ పేగు బంధం, పెంచిన మమకారం ఆ తల్లిని ఊరుకోనివ్వలేదు.