చోరీ కేసులో నిందితులు అరెస్ట్
కామారెడ్డి: మాచారెడ్డి మండలంలో మార్చి 23న అక్కపూర్ గ్రామానికి చెందిన హరి రాజవ్వ (62)ను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి రూ.5,000 నగదు దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం పాల్వంచ మర్రి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3వేల నగదు, ఒక బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.