ఈనెల 9 నుంచి అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఈనెల 9 నుంచి అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ

సత్యసాయి: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి ఈనెల 9 నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. 9న మహిళలకు, 12న ఏపీ పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుందన్నారు.