విశాఖలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
VSP: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజలాడుతున్నారు. పెందుర్తి కనిష్ఠ ఉష్ణోగ్రత 12.7 డిగ్రీలు నమోదు కాగా, గాజువాక 14.7, ఆనందపురం 15, భీమునిపట్నం 15.2, పద్మనాభం 15.8, మహారాణిపేట 16.3, సింహాచలం 17 డిగ్రీలు నమోదు అయ్యింది.