జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
ఏలూరు: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్లు, బస్సులను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల రవాణా, పేలుడు పదార్థాలు, అసాంఘిక శక్తులను గుర్తించడం వంటి లక్ష్యాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.