VIDEO:పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్
కోనసీమ జిల్లాలో ‘NTR భరోసా’ పింఛన్ల పంపిణీ పారదర్శకంగా, జవాబుదారితనంతో జరుగుతోందని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం అమలాపురం పట్టణంలోని మెట్ల కాలనీలో మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఆయన స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి నెలా పింఛన్ అందుతున్న తీరును కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.