నూతన ఎంపీడీవోను కలిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేతలు
WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో నూతన ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వెంకటశివానంద్‌ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా, మండల నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి తోడ్పడుతూ.. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రమేష్, నరేష్, భూక్యా రాజు, శివ, భాస్కర్, చందర్, మోహన్ తదితరులున్నారు.